ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమైన సినిమా ‘సర్కారు నౌకరి’ సినిమా జనవరి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకున్న ఈ సినిమా.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. ఆకాష్ సరసన భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విడుదలైన 10 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో జనవరి 12 నుండి ఈ సినిమా స్ట్రీమిగ్ అవుతోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం, థియేటర్లు అన్ని పెద్ద సినిమాలకే బుక్కయిపోవడంతో.. మేకర్స్ ఈ సినిమాని ఓటీటీలోకి వదిలేశారు. ఓటీటీలో కూడా ఈ సినిమా మంచి ఆదరణనే రాబట్టుకుంటున్నట్లుగా…