యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ‘రుద్రాక్షపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచభాషా తార హీరో సుమన్ గారు మరియు సీనియర్ నటుడు భానుచందర్ జంటగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మ్యాక్ ఉడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ‘రుద్రాక్షపురం’ టైటిల్ లోనే ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇదొక్క పవర్ ఫుల్ టైటిల్. దీంట్లో నటించిన ఆర్టిస్ట్ తో పాటు టెక్నీషియన్స్ కూడా ఎంతగానో శ్రమించి చేసిన సినిమా ఇది. ఇంతకు ముందు గాంధి గారి మొదటి సినిమా ‘ప్రేమభిక్ష’ లో నేను నటించాను. ఆయన సినిమా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన తపనకు భగవంతుడు తప్పక ఫలితం ఇస్తాడని ఆశిస్తున్నాను అంటూ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు తెలిపారు. ‘రుద్రాక్షపురం’ సినిమా లో…