’35 – చిన్న కథ కాదు’ స్కీన్ ప్లే పుస్తకం ఆవిష్కరణ

Launch of the screenplay book for '35 - Chinna Katha Kaadu'
Spread the love

’35 – చిన్న కథ కాదు’ కు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా ప్రచురించడం మరింత సంతోషంగా ఉంది: దర్శకుడు నందకిశోర్
2024 సంవత్సరానికి గాను ’35 – చిన్న కథ కాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్‌దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 2024లో విడుదలైన ’35 – చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. విడుదల సమయంలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది. ఈ సందర్భంగా ’35 – చిన్న కథ కాదు’ స్కీన్ ప్లే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దర్శకుడు నందకిశోర్ మాట్లాడుతూ… 2018లో  35 – చిన్న కథ కాదు ఒక ఆలోచనతో మొదలైంది. 2026కి ఇక్కడివరకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పడిన కష్టం, దాన్ని దాటుకుని వచ్చిన అనుభవం… కాలం గడిచే కొద్దీ మధుర జ్ఞాపకంగా మారుతుంది. ఇక్కడివరకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేషనల్ అవార్డ్ జ్యూరీకి, భారత ప్రభుత్వానికి సవినయంగా నమస్కరిస్తున్నాను. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా ప్రచురించడం కూడా చాలా ఆనందంగా ఉంది.
హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ… సురేష్ బాబు గారికి, స్పిరిట్ మీడియాకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నారు అంటే, ’35 – చిన్న కథ కాదు’ చేసిన మ్యాజిక్ అది. నందకిశోర్ ఆలోచనతో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు ఢిల్లీ వరకు వెళ్లింది. అది నిజంగా చిన్న కథ కాదు. సినిమాలో ప్రసాద్ పాత్రలో నేను చెప్పిన ‘చిన్న కథ కాదు’ అనే ఊతపదం ఈరోజు దేశవ్యాప్తంగా మారుమోగుతుండటం కూడా చిన్న విషయం కాదు. సృజన, సిద్ధార్థ్ చాలా వైవిధ్యమైన నిర్మాతలు. ఇలాంటి సినిమాను ముందుగా నమ్మాలంటే చాలా ధైర్యం కావాలి. దర్శకుడిని, నన్ను ప్రసాద్ పాత్రలో నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు అందుకోవడం నిజంగా చిన్న కథ కాదు. ‘బాల రామాయణం’ చిత్రానికి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత మళ్లీ 35 – చిన్న కథ కాదు కు  ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు రావడం మామూలు విషయం కాదు. వివేక్ సాగర్, నికేత్ బొమ్మి, ఈ సినిమాలో పనిచేసిన అందరూ ఒకరికొకరు తోడై ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిందంటే, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ జాతీయ అవార్డు వచ్చినట్లే. ప్రేక్షకులు చూపించిన ప్రేమే ఈరోజు మాకు జాతీయ అవార్డు రూపంలో వచ్చింది. నటుడిగా ఈ సినిమా నాకు ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది. నాని గారు ఈ సినిమా గురించి చెప్పిన మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. అలాగే ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ ఆ బలాన్ని మరింత పెంచింది. సురేష్ బాబు గారు, రానా గారు ఈ సినిమా వెనుక నిలబడకపోయి ఉంటే ఇది ఇంతమందికి తెలిసేది కాదు. సిద్ధూకి థ్యాంక్యూ.
దర్శకుడు సజీవ్ మాట్లాడుతూ… మా సినిమా టీమ్ అందరికీ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ సినిమా దాదాపు 10 ఏళ్ల జర్నీ. చిన్న ఆలోచనగా మొదలైన ఈ కథను నందు నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్లి నిలబెట్టాడు. తన ప్రయాణం నిజంగా అందరికీ ఆదర్శం. నందు ఒక మంచి పుస్తకం లాంటి వ్యక్తి. అందులో చాలా మంచి చాప్టర్లు ఉంటాయి. ఈ సినిమాకు తొలి సహాయ దర్శకుడిగా పని చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అరుణ్ ఈ సినిమాతో జాతీయ అవార్డు అందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాను రీ-రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.
చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ మాట్లాడుతూ… ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాలోనే మోస్ట్ సీనియర్ భాగ్యరాజ్ గారు, గౌతమి మేడం గారితో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. జాతీయ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్యూ సో మచ్.
దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ… ఈ సినిమా నన్ను మళ్లీ నా బాల్యంలోకి తీసుకెళ్లింది. ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి మనసును కదిలించింది. ఇది నిజంగా ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి సినిమా రాయాలన్నా, తీయాలన్నా చాలా ధైర్యం కావాలి. నందు ఈ జాతీయ అవార్డుకు పూర్తిగా అర్హుడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా తీసుకురావడం చాలా మందికి ఉపయోగపడుతుంది.
దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ… నందు ఎంత అద్భుతమైన సినిమా తీశాడో చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూస్తూ నేను మూడుసార్లు ఏడ్చాను. ఈ పుస్తకాన్ని కూడా అందరూ చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దర్శకుడు అనురాగ్ మాట్లాడుతూ… ఒక సినిమాను పుస్తకంగా ప్రచురిస్తున్నారు అంటే, అది ఎంత ప్రత్యేకమైన సినిమానో అర్థమవుతోంది. నందకిశోర్ సక్సెస్‌ను నా సక్సెస్‌గా భావిస్తుంటాను. టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ… టీమ్ అందరికీ అభినందనలు. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు రావడం 30 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇలాంటి గొప్ప గౌరవాన్ని అందుకున్న టీమ్ మొత్తానికి అభినందనలు. ఒక మంచి కథ చెబితే అది ప్రేక్షకులకు తప్పకుండా చేరుతుందని ఈ సినిమా నిరూపించింది. మంచి, నిజాయితీతో సినిమా తీస్తే ఎంత మంచి పేరు వస్తుందో ఈ చిత్రం చూపించింది. నేను, విశ్వదేవ్ చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఈరోజు నటుడిగా తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలు.
దర్శకుడు వినోద్ మాట్లాడుతూ…ఈ సినిమా చాలా సహజంగా అనిపించింది. మనం ఉంటున్న ఇల్లు, మనుషులు, వారి జీవితాలనే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అలాంటి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. దర్శకుడు నందు చాలా సహజంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. సినిమా చూస్తున్నంతసేపూ నా కుటుంబాన్ని నేనే చూస్తున్నాననే అనుభూతి కలిగింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పుస్తకంగా తీసుకురావడం చాలా మంచి ఆలోచన. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.

Related posts