బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు గారు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతోన్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ గారు వీ.ఎన్ ఆదిత్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభమైంది.
నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చిన వి వి వినాయక్ గారికి, V N ఆదిత్య గారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
దర్శకుడు హర్షవర్దన్ పారెళ్ళ మాట్లాడుతూ .. ‘‘కుటుంబ కథా చిత్రంగా మా ‘కరుణామయ’ తెరకెక్కబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నాగేశ్వరరావు గారికి థాంక్స్. తండ్రీ కొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో కూడిన కథ గా సినిమా ఉంటుంది. మా కోసం వచ్చిన దర్శకులు వి వి వినాయక్ గారికి, వీఎన్ ఆదిత్య గారికి థాంక్స్.ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా టీం మొత్తం కష్టపడతాం. డిసెంబర్ 23న మా మూవీని రిలీజ్ చేస్తామ’ని అన్నారు.
హీరో చైతన్య శక్తి మాట్లాడుతూ .. ‘‘కరుణామయ’ చిత్రంలో నేను హీరోగా పని చేస్తున్నాను. ఇంత మంచి కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నామ’ని అన్నారు.
హీరోయిన్ స్వాతి శ్రీ మాట్లాడుతూ .. ‘‘కరుణామయ’ సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కేవలం ఒక మతానికే చెందిన వారే కనెక్ట్ అవుతారని కాకుండా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
నటీనటులు : చైతన్య శక్తి, స్వాతి శ్రీ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్ :బాబీ పిక్చర్స్
సమర్పణ : ఆరాధ్య హైందవి
నిర్మాత : సంకాబత్తుల నాగేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోనిక
దర్శకుడు :హర్షవర్దన్ పారెళ్ళ
పీఆర్వో : పాల్ పవన్.



