సుమన్-భానుచందర్ చేతులమీదుగా ‘రుద్రాక్షపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Rudrakshapuram firstlook poster relese
Rudrakshapuram firstlook poster relese
Spread the love

యాక్షన్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ‘రుద్రాక్షపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచభాషా తార హీరో సుమన్ గారు మరియు సీనియర్ నటుడు భానుచందర్ జంటగా విడుదల చేసారు. ఈ చిత్రాన్ని మ్యాక్ ఉడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ ‘రుద్రాక్షపురం’ టైటిల్ లోనే ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఇదొక్క పవర్ ఫుల్ టైటిల్. దీంట్లో నటించిన ఆర్టిస్ట్ తో పాటు టెక్నీషియన్స్ కూడా ఎంతగానో శ్రమించి చేసిన సినిమా ఇది. ఇంతకు ముందు గాంధి గారి మొదటి సినిమా ‘ప్రేమభిక్ష’ లో నేను నటించాను. ఆయన సినిమా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన తపనకు భగవంతుడు తప్పక ఫలితం ఇస్తాడని ఆశిస్తున్నాను అంటూ చిత్ర యూనిట్ కు శుభాశీస్సులు తెలిపారు. ‘రుద్రాక్షపురం’ సినిమా లో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూ నూతన సంవత్సర ఓ బహూమతిగా మారుతుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో తలమునకలై ఉన్న ‘రుద్రాక్ష పురం’ సినిమాని ఫిబ్రవరి నెలలో తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నామని నిర్మాత ఉపేందర్ కొండ్రాసి తెలిపారు
మణి సాయి తేజ,పవన్ వర్మ, రాజేశ్ రెడ్డి,రేఖ వైడూర్య,అక్షర నిహా,నాగమహేశ్, సురేష్ కొండేటి, వీరబాబు, ధీరజ్ అప్పాజీ, శ్రీవాణి, శోభరాజ్, అజయ్ రాహుల్,
భల్రాం తదితురలు నటించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : ఆర్.కె.గాంధి , గంటాడి కృష్ణ, జయసూర్య బొంపెం, ఎం.ఎల్ రాజ-సాహిత్య సంగీతం, థ్రిల్లర్ మంజు, స్టార్ మల్లి, బాజి-సాహసం, ఎం నాగేంద్ర కుమార్ ఛాయాగ్రహణం, పి ఆర్ ఓ : వీరబాబు.