ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజన్ 2 అక్టోబర్ 23న రాబోతుంది. సీజన్ 1లో ఖాలీన్ భయ్యాగా ఫేమెస్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సందర్భంగా తెలుగు సినీ పాత్రికేయలతో ముచ్చటించారు, ఆయనతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజన్ 1 లో నేను పోషించిన కాలిన్ భయ్య పాత్ర నన్ను తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. రోజుకి సోషల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజన్ 2 రాబోతుందనే ప్రకటణ వచ్చినప్పటి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…
Tag: release date
బాలకృష్ణ ‘నర్తనశాల’కు మోక్షం
సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయదర్శకత్వంలో అపురూప చిత్రం నర్తనశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా ఈ విజయదశమి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో నర్తనశాల కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24…
‘లింగొచ్చా’ చిత్ర టీజర్ విడుదల ఎప్పుడంటే..?
శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో యాదగిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్‌కి జోడిగా సుప్యార్దే సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియెన్స్‌లో లింగొచ్చా అనే టైటిల్‌కి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలోనే చిత్ర టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యాదగిరి రాజు, దర్శకుడు ఆనంద్ బడా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు. నటీనటలు:కార్తీక్ రత్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగల్, మాస్టర్ ప్రేమ్ సుమన్,…