“రాక్షస కావ్యం” ట్రైలర్ విడుదల

"Rakshasa Kavyam" trailer released

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. “రాక్షస కావ్యం” చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం.. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – రాక్షస కావ్యం ట్రైలర్ చూశాను. ఇండస్ట్రీలోని కొత్త వాళ్లు, చిన్న వాళ్లు చేసిన ప్రయత్నమిది. ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో విషయం…