సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రదారులుగా రామ్ గణపతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రాజయోగం’. ఈ సినిమాలోని ఇతరపాత్రల్లో ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు నటించారు. మణి లక్ష్మణ్‌రావునిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహించారు. సాంకేతిక విషయాలకొస్తే.. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఏ చిత్రానికి ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: అరుణ్ మురళీధరన్, మాటలు : చింతపల్లి రమణ సమకూర్చారు. ఈ రోజు (30-12-2022)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం… మధ్యతరగతి కుటుంబానికి చెందిన…