టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో తానూ నటించట్లేదు అని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచం సినీ లోకమే గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్ లు కూడా ఏ మాత్రం నా వల్ల ఆలస్యం కాకూడదనుకుంటున్నాను. అందుకే నేను పని చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం కొన్ని కారణాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాత, సెవెన్ స్క్రీన్…