టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ బ్యూటీ రాశి సింగ్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన కొన్ని సాంప్రదాయ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మినిమం మేకప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. క్లాసీ లుక్‌తో పాటు తనదైన గ్లామర్‌ను జోడించి ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించిన రాశి సింగ్ 18 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు మారడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉద్యోగంలో ఎంత సంతోషంగా ఉన్నా, నటనపై ఉన్న మక్కువతో రిస్క్ తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి టాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2021లో ఆది సాయికుమార్ సరసన ‘శశి’ చిత్రంతో రాశి సింగ్ తెలుగు ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘పోస్టర్’, ‘జెమ్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో దూకుడుకేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ రాశి సింగ్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. భూతద్ధం భాస్కర్ నారాయణ (2024), ప్రసన్నవదనం (2024), సుహాస్ హీరోగా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ‘ఏసీపీ వైదేహి’ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించి, వర్సటైల్ నటిగా ప్రశంసలు అందుకున్నారు. వైవిధ్యమైన జోనర్లలో వచ్చిన ఈ చిత్రాలు ఆమె నటనలోని సరికొత్త కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. కేవలం వెండితెరపైనే కాకుండా ‘పాపం పసివాడు’, ‘త్రీ రోజెస్ (సీజన్-2)’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌ల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చాటారు. సోషల్ మీడియాలో సెన్సేషన్సినిమాల్లో డీగ్లామరైజ్డ్, సీరియస్ పాత్రలు చేసినప్పటికీ, రియల్ లైఫ్‌లో రాశి సింగ్ ఎంతో స్టైలిష్‌గా ఉంటారు.
ఎయిర్ హోస్టెస్ నుండి వెండితెరకు..
