‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు

producer d sureshbabu pressmeet

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు మాత్రమే ‘నారప్ప’ షోలు విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… -డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్…