టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’. కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీసింహా కోడూరి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.. -‘మత్తువదలరా’ సినిమా కథ విని ఓకే చెప్పిన కథ ఈ ‘ఉస్తాద్’. అయితే షూటింగ్స్ ఆలస్యం కావటం వంటి కారణాలతో ఇప్పుడు అన్నీవరుసగా విడుదలవుతున్నట్లు అనిపిస్తున్నాయి. *-దర్శకుడు ఫణిదీప్ క్యారెక్టర్స్‌ను చక్కగా డిజైన్ చేసుకున్నారు. సూర్య అనే యువకుడి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన నాలుగు సినిమాల్లో ఇది నా క్యారెక్టర్ మీదనే రన్ అవుతుంది.…