ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్స్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణ లో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఓ తండ్రి తీర్పు చిత్రం పోస్టర్ ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ ఆవిష్కరించారు. రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఓ తండ్రి తీర్పు చలన చిత్రం పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ… ” 1985 వ సంవత్సరం జయభేరి బ్యానర్లో నేను కథానాయకుడుగా నిర్మించిన ఓ తండ్రి తీర్పు ఘన విజయం సాధించింది. నంది అవార్డు కూడా వచ్చింది. అది నా సినీ జీవితంలో ఒక మైలు రాయి. ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే టైటిల్ తో వస్తున్న ఓ తండ్రి తీర్పు కూడా ఘన విజయం సాధించి అవార్డ్స్ అందుకుంటుంది.…