లేడీ సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకున్న ఈ భామ.. తాజాగా ‘అన్నపూరణి’ . సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. నయన్ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ సినిమాను నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తుంది. అయితే ఈ సినిమాలో నయనతార ఓ యంగ్‌హీరోకు అక్కగా నటించనున్నారట. తన భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ సిస్టర్ రోల్ చేయబోతుంది. ‘లవ్ టుడే’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్‌తో విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలోనే ప్రదీప్‌కు అక్కగా నయనతార…