Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

Narayana & co movie review : నారాయణ & కో : చూడచక్కని వినోదం!

(చిత్రం : ‘నారాయణ & కో’ , విడుదల తేది: జూన్‌ 30, 2023, రేటింగ్: 3.25/5, నటీనటులు: సుధాకర్‌ కోమకుల, ఆర్తిపొడి, దేవి ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి తదితరులు. నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమకుల, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశి, జోశ్యభట్ల శర్మ, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాస్తవ్) కథ:నారాయణ(దేవి ప్రసాద్‌), జానకి(ఆమని) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. నారాయణ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. పెద్ద కొడుకు ఆనంద్‌(సుధాకర్‌ కోమకుల) క్యాబ్‌ డ్రైవర్‌. క్రికెట్‌లో బెట్టింగ్‌ పెడుతుంటాడు. దీంతో అతనికి రూ.10 లక్షల వరకు అప్పు అవుతుంది. చిన్న కొడుకు సుభాష్‌ (జై కృష్ణ) కెమెరామెన్‌. ఓ చావు ఇంటికి ఫోటోలు తీయడానికి వెళ్లి ఓ అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వారిద్దరు సన్నిహితంగా ఉన్న…