కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే… -చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది. -సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య…