గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’లో పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా…ఈ నెల 15న విడుదల కానున్న ‘సుగుణ సుందరి’ రెండో సింగిల్ లో లీడ్ పెయిర్ కనిపించనుంది. బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్ గా ఉంది. అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి…