వీఐపీ మోషన్ పిక్చర్స్ – ఖడ్గధార క్రియేషన్స్ బ్యానర్లపై ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘మృత్యుంజయుడు’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. రామారావు బండారు దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని, ప్రస్తుతం వస్తోన్న చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా తెరకెక్కుతోందని నిర్మాత వీఐపీ శ్రీ తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఐదవ చిత్రమిది. అతడి పాత్ర ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని, హీరో క్యారక్టర్ విభిన్నతరహాలో ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ సెప్టెంబర్ లో పూర్తి అయింది. సెకండ్ షెడ్యూల్ అమెరికాలోని కొలివియాలో ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆయన వివరించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ విషయంలో ఇంకా కన్ఫర్మ్ కావలసి…