మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా కసాండ్రలపై చిత్రీకరించారు. టాలీవుడ్‌లో డాన్స్, ఇరగదీసే స్టెప్పులంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెషల్ సాంగ్‌లో ఆయన డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మార్క్ స్టెప్పులతో చిరంజీవి డాన్స్ అదరగొట్టేశారు.…