అనాథ పిల్లల కోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించిన మహేష్ బాబు కుమార్తె సితార

Mahesh Babu's daughter Sithara organized a special screening of 'Guntur Karam' for orphans.

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని అందరి మనసులు గెలుచుకునే గొప్ప పని చేసింది. చీర్స్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లల కోసం, సంక్రాంతి కానుకగా విడుదలైన తన తండ్రి తాజా చిత్రం “గుంటూరు కారం” ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది. మహేష్ బాబు ఫౌండేషన్ సహకారంతో ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని పసి హృదయాలకు సినిమాటిక్ ట్రీట్‌ను అందిస్తూ ఏఎంబీ సినిమాస్‌లో అద్భుత సాయంత్రం ఆవిష్కృతమైంది. పిల్లలతో పాటు, వారి సంరక్షకులు కూడా మహేష్ బాబు నటించిన తాజా చిత్రం “గుంటూరు కారం” యొక్క ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. సితార ఘట్టమనేని, తన సహజసిద్ధమైన ఆకర్షణతో, పిల్లలందరూ ప్రత్యేకంగా భావించేలా మరియు సినిమా వేడుకలో భాగమయ్యేలా అద్భుతంగా హోస్ట్‌ చేసింది. పిల్లల ఆనందం మరియు ఉత్సాహం వేడుకకు అదనపు ఆకర్షణగా…