కమల్‌ మరో సినిమాతో రెడీ!

Kamal is ready with another film!

ఉలగనాయగన్‌ కమల్‌ హాసన్‌ మరో సినిమాకు సైన్‌ చేశారు. చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన ‘విక్రమ్‌’ సినిమా కమల్‌ హాసన్‌లో ఎనర్జీని నింపడంతో.. ఇక వరసగా సినిమాలు చేస్తానని ప్రకటించిన ఈ యూనివర్సల్‌ స్టార్‌.. చెప్పినట్లుగానే వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో మోస్ట్‌ అవైటెడ్‌ గ్యాంగ్‌ స్టర్‌ యాక్షనర్‌ ’థగ్‌ లైఫ్‌’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. మరోవైపు కమల్‌ హాసన్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్‌(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కమల్‌ హాసన్‌ తెలియజేస్తూ.. ’ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్‌ అన్బరివ్‌ రాజ్‌ కమల్‌…