టెలివిజన్ ప్రీమియర్‌ లోనూ ‘కార్తికేయ – 2’ ప్రభంజనం

Kaarthikeya2 Movie Prabanjanam

నిఖిల్ సిద్ధార్థ నటించిన ఎపిక్ అడ్వెంచర్ ‘కార్తికేయ 2’ ప్రతిచోటా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ విజయంతో పాటు అగ్ర దర్శకులు, హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. థియేటర్లు, OTTలో మంచి రికార్డ్స్ సృష్టించిన తర్వాత, ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌లో చాలా మంచి టిఆర్‌పి రేటింగ్‌లను పొందింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జీ తెలుగులో ప్రసారం కావడం ద్వారా 7.88 రేటింగ్‌ను అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ‘కార్తికేయ 2’కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. థియేటర్లలో, ఓటీటీలో, ఇప్పుడు ఇంట్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మకంగా…