జెన్నిఫర్ కు నచ్చిన హీరో ఎవరో తెలుసా?

jennifar hero

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్‌ తెరకెక్కిస్తున్నారు. లవ్‌, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… – నేను ముంబై నుంచి వచ్చాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేశాను..తర్వాత జర్నలిజం లో డిప్లొమా పూర్తయ్యాక యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో పాటు భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆఫర్స్​‍ వచ్చాయి. నేను టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రం బాయ్స్​‍ విల్‌ బీ బాయ్స్​‍.…