జాన్వీ కపూర్‌ సౌత్‌లో ఎంట్రీ ఇవ్వనుందా?

janvikapoor south entry khayamaindha?

ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త బాగా షికారు చేస్తోంది. ‘ఎన్ఠీఆర్30’ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్‌ చేయబోతోందని! అవునా.. ఇది నిజమా? అంటున్నారు జూనియర్ ఎన్ఠీఆర్ అభిమానులు. అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ ఇప్పుడు సౌత్ వైపు అడుగులేసేందుకు ఆసక్తి చూపిస్తోందిట! ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించాలని అనుకుంటోందట. కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ సౌత్ సినిమాల గురించి, అలాగే ఎన్టీఆర్ గురించి ప్రతి చోటా మాట్లాడుతోన్న తీరు చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. వాస్తవానికి ‘లైగర్’ సినిమాతో జాన్వీ కపూర్‌ని సౌత్ సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పూరి జగన్నాథ్ ఎంతగానో ప్రయత్నించారట. ఈ విషయం ‘లైగర్’ ప్రమోషన్స్‌లో కూడా పూరి చెప్పుకొచ్చారు. ‘లైగర్’ కంటే ముందు కూడా చాలా సినిమాల విషయంలో జాన్వీ…