ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబు చాలా సెలెక్టివ్ గా రోల్స్ ఎంపిక చేసుకుంటూ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా నిర్మాత తన చిరకాల మిత్రుడు రాజేందరరెడ్డి నిర్మించిన ‘సింబా’ చిత్రంలో పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తమ్ రెడ్డి పాత్రను పోషించారు. ఆయనకు సహాయకులుగా నిత్యం వార్తల్లో వుండే గ్లామర్ బ్యూటీ అనసూయ, యానిమల్ లో నటించిన యంగ్ హీరో మాగంటి శ్రీనాథ్ నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ మాస్ దర్శకుడు సంపత్ నంది కథ.. మాటలు అందించారు. ఆయన కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా వ్యవహరించారు. ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించి… ఓ మెసేజ్ కూడా ఇచ్చినట్టు ఇటీవల మూవీ నిర్మాత తెలిపారు. జగపతిబాబు ఇంటి ఆవరణంలో విపరీతంగా పచ్చదనం ఉంటుందని, ఆయన అయితే ఈ సినిమా టైటిల్ పాత్రకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ…