గీతాఆర్ట్స్ సమర్పిస్తున్న సెల్వరాఘవన్, ధనుష్ ల ‘నేనే వస్తున్నా’ నుండి ‘ఒకే ఒక ఊరిలోనా..’ పాట విడుదల

The ecstatic second single Oke Oka Oorilona from Dhanush' Nene Vasthunna is here
The ecstatic second single Oke Oka Oorilona from Dhanush' Nene Vasthunna is here
Spread the love

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. “నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది.
తాజాగా ఈ చిత్రం నుండి “ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
ఈ పాటను చంద్రబోస్ రచించారు.
“పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది
పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది”
లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా, ఆలోచించే విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు
సాంగ్ క్రెడిట్స్:
రచన: చంద్రబోస్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సింగర్: ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ
టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్
దర్శకుడు: సెల్వ రాఘవన్
బ్యానర్: వి క్రియేషన్స్
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సమర్పణ: గీతా ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్