ఖాన్స్‌- కపూర్స్‌కు కాలం చెల్లినట్టేనా?

Is it time for the Khans and Kapoors?

దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కపూర్స్, ఖాన్స్ రాజ్యమేలారు. ఇప్పుడు వారి ప్రభ తరిగిపోతోందంటున్నారు కొందరు. అది సాధ్యమేనా అన్నది ఇంకొందరి అనుమానం. బాలీవుడ్‌లో తాజా విజయాలతో ఖాన్స్, కపూర్స్ పని అయిపోయిందనడం తొందరపాటు చర్యేనని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమీర్‌, సల్మాన్‌, షారుఖ్‌ విజయాలను విస్మరించలేమని వారు అంటున్నారు. గత సంవత్సరం టాప్ త్రీ బాలీవుడ్ మూవీస్‌ను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్‌లో ‘ధురంధర్’, సెకండ్ ప్లేస్‌లో ‘ఛావా’, థర్డ్ లో ‘సైయారా’ ఉన్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఖాన్స్ కానీ, కపూర్స్ కానీ లేకపోవడం గమనార్హం అంటున్నారు బాలీవుడ్ బాబులు. ఇక ఈ యేడాది ఇప్పటిదాకా టాప్ గ్రాసర్ ఏది అంటే ‘ధురంధర్-2’ అనే చెప్పాలి. ఈ లెక్కలు చూసి కొందరు ఇక ఖాన్స్‌కు, కపూర్స్‌కు కాలం చెల్లినట్టే అంటున్నారు. ఏదో ఒకటి రెండు సంవత్సరాల్లో ఖాన్స్ కానీ,…