కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామి రంగ’ నుంచి ‘వరలక్ష్మి’గా ఆషికా రంగనాథ్‌ పరిచయం

Introducing Ashika Ranganath as 'Varalakshmi' from King Nagarjuna Akkineni's 'Na Sami Ranga'

తన దశాబ్దాల కెరీర్‌లో ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేసిన కింగ్ నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం ‘నా సామి రంగ’తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ కథానాయికగా నటిస్తుండగా, ఈరోజు మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్ ద్వారా ‘వరలక్ష్మి’గా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో ఆకర్షణీయంగాఉంది. ఆషికా అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు మేకర్స్ ఒక గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇందులో దూరం నుండి ఒకరినొకరు మెచ్చుకుంటూ కనిపించడం చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి తన స్పెల్‌బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. నాగార్జున…