ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు జెండాను ఎగురవేశారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సందీప్ ప్రకాష్ ఐ.ఆర్.ఎస్. చీఫ్ కమిషనర్, హీరో శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో మొదటగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ ఫౌండర్ మెంబర్స్ ను స్మరించుకున్నారు. ముఖ్య అతిధి సందీప్ ప్రకాష్ , ఫౌండర్ కమిటీ మెంబర్ సినీ నటుడు మాగంటి మురళీమోహన్, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, మాజీ అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, డా. కె.ఎల్. నారాయణ, పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడారు. అనంతరం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ దత్తత తీసుకున్న గవర్నమెంట్…