లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ‘దండోరా’ మూవీ సెకండ్ షెడ్యూల్లో పాల్గొన్న విలక్షణ నటి బిందు మాధవి

Iconic actress Bindu Madhavi participates in the second schedule of Laukya Entertainments' movie 'Dandora'

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’..బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో విలక్షణ పాత్రలతో హీరోయిన్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిందు మాధవి భాగమయ్యారు. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ టచ్‌తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌లో వెర్సటైల్ యాక్టర్ శివాజీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిందు మాధవి కూడా జాయిన్ కావటం విశేషం. ఫ‌స్ట్ బీట్ వీడియోతో అంచనాలు పెంచుకున్న…