స్నేహితుల మధ్య నమ్రత పుట్టినోజు వేడుకలు

Humble birthday celebrations among friends

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ తన పుట్టినరోజుని హైదరాబాదులో ఎంతో సంబరంగా జరుపుకున్నారు. మహేష్‌ బాబు జర్మనీలో ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లారు, బహుశా నమ్రత పుట్టినరోజుని మహేష్‌ ఇలా మిస్‌ అవటం ఇదే మొదటి సారి ఏమో. అయితే నమ్రత తన స్నేహితులు చాలామందిని పిలిచారు, అందరూ హాజరయ్యారు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా చాలామంది హాజరయ్యారు. ఈసారి పుట్టినరోజు ఎంతో సంబరంగా, ఒక మంచి జ్ఞాపకంగా చేసుకున్నారు నమ్రత. మహేష్‌ బాబు సోదరీమణులు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి తో పాటు రమేష్‌ బాబు భార్య కూడా నమ్రత పుట్టినరోజు సంబరాలకు హాజరైన వారిలో వున్నారు. ఇక తన పిల్లలు సితార, గౌతమ్‌ కూడా నమ్రత దగ్గరే వున్నారు. చాలామంది సెలెబ్రెటీలు హాజరయ్యారు. నారా లోకేష్‌ భార్య నారా బ్రాహ్మణి…