‘హిట్ ది ఫస్ట్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు తగ్గట్టే హిట్ సాధించారు శైలేష్ కొలను. ఇప్పుడు ఆయన హిట్ యూనివర్స్‌ని రూపొందించారు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందిన మరో చిత్రం ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈక్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నాని మాట్లాడుతూ.. ‘సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. వాల్ పోస్టర్ టీంకు థాంక్స్. పావని శ్రద్దగా, కోమలి వర్షగా చక్కగా నటించారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ వెంకట్ వంటి వారు దొరకడం మా అదృష్టం. సినిమాలోని వయలెన్స్‌ను మీనాక్షి తన అందంతో బ్యాలెన్స్ చేసింది. శ్రీనాథ్ చక్కగా నటించారు.…