అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాపై శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మాతగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా… దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు ఇంగ్లీష్‌లో మాట్లాడి మాట్లాడి చిరాకేసింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది. హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్‌లకు కంగ్రాట్స్. అదంత ఈజీ కాదు.. హిట్ సినిమా చేయొచ్చు కానీ..…