టాలీవుడ్ లో ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను అన్నివర్గాల ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. సినిమాలో ఏదైనా కొంచెం కొత్తగా కంటెంట్ ఉన్నా ఆయా సినిమాలను అక్కున చేర్చుకుంటారు. అలాంటి ఓ ఉత్కంఠ కలిగించే సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు మనముందుకొచ్చింది. బసిరెడ్డి రానా దర్శకత్వంలో సహస్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో.. నిర్మాత నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించిన తాజా చిత్రం ‘హైడ్ న్ సిక్’. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రచారచిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. కేరింత, మనవంతా వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసులను దోచుకున్న యువ హీరో విశ్వంత్ ఈ చిత్రానికి కథానాయకుడు కావడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. యంగ్ హీరో విశ్వంత్ నటిస్తున్న చిత్రం అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకంతో…