‘హాయ్ నాన్న’ ప్రేక్షకులందరినీ అలరించే సినిమా : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని

'Hi Nanna' is a movie that entertains all the audience: Nani is a natural star at the teaser launch event

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ టీజర్ లాంచ్- డిసెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్ సండే అంటే ఫ్యామిలీ టైం. నేచురల్ స్టార్ నాని తన పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ నుంచి మనసుని హత్తుకునే టీజర్ ను విడుదల చేయడంతో ఈ సండే మరింత ప్రత్యేకంగా నిలిచింది. నాని, బేబీ కియారా ఖన్నా మధ్య అందమైన ప్రయాణంతో తండ్రీ-కూతుళ్ల కథగా టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత నాని, మృణాల్ ఠాకూర్‌ లవ్ జర్నీని ప్రజంట్ చేసింది. బేబీ కియారా అతని కూతురా? నాని, మృణాల్‌ని ఇంతకు ముందు కలిశాడా? మృణాల్ వేరొకరితో తన పెళ్లికి ముందు నానికి ఎందుకు ప్రపోజ్ చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు శౌర్యువ్ తన మొదటి సినిమాతోనే మ్యాజిక్…