NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాక్టర్ మధు మాట్లాడుతూ.. డైరెక్టర్ భరత్ తాను స్నేహితులమాని చెప్పారు. భరత్ సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పడంతో నేను చేయగలనా అనే డౌట్ వచ్చింది. తర్వాత కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా…