హీరో కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, నేహా శెట్టి కథానాయికగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెంచుకుంటున్న చిత్రం ‘బెదురులంక 2012’. ఆర్ఎక్స్ 100 తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న హీరో కార్తికేయ గుమ్మకొండ కి భారీ సక్సెస్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవ్వరూ గెలుచుకోని బెస్ట్ యాక్టర్ – నేషనల్ అవార్డు పుష్ప చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ కి దక్కింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ బన్నీ ని కలవడానికి వెళ్లగా, బన్నీ – కార్తీకేయ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ చిత్రానికి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో తన ఫ్యామిలీ తో…