‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. తెలుగుకు తనను పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా ‘మంగళవారం’. ఆమెకు జోడీగా ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాయల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మీరు నటించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా మొదలైంది? ‘సార్… నాకు ఒక సినిమా ఇవ్వండి. ఒక అవకాశం కావాలి’ అని అజయ్ భూపతి వెంట పడ్డాను.…