హీరో సూర్య ముంబైకి మకాం మార్చారా?

Has hero Surya moved to Mumbai?

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఆయన ముంబయికి మకాం మార్చాడు అంటూ వస్తున్న వార్తలు మాత్రం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబంతో సహా సూర్య ముంబయి వెళ్లి పోయాడు అనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలకు సూర్య స్పందించలేదు. కానీ తాజాగా సూర్య ఫ్యాన్స్‌ మీట్‌ లో పాల్గొన్నాడు. ఫ్యాన్స్‌ తో చిట్‌ చాట్‌ సందర్భంగా ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. ఒక అభిమాని మాట్లాడుతూ మీరు ముంబయి మకాం మార్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అన్నట్లుగా ప్రశ్నించడం జరిగింది. ఫ్యాన్‌ ప్రశ్నకు సూర్య స్పందిస్తూ.. ముంబయికి మకాం మార్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. తన ఇద్దరు…