‘మనం సైతం కాదంబరి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Free mega medical camp under the auspices of 'Manam Sait Kadambari Foundation'

మనం సైతం కాదంబరి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ష్యూర్ ఆడియో టెక్నాలజీస్ (Shure Audio Technlogies ) సంస్థ వారి CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో ‘మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ సంస్థ నిర్వ‌హ‌కులు కాదంబ‌రి కిర‌ణ్ మాట్లాడుతూ.. ”ఆరోగ్యమే మహాభాగ్యం.. ఎవ‌రికైనా మంచి ఆరోగ్యానికి మించిన సంపద లేదు. అందుకే ఈ…