ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం ఎందరో మహనీయులు వారి ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించారు. వారందరిదీ ఒక్కో చరిత్ర. అలాంటి వారిలో ఖుదీరామ్ బోస్ ఒకరు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసి అమరుడయ్యారు ఖుదీరామ్ బోస్. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ హవా నడుస్తుంది. ఆ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘ఖుదీరామ్ బోస్’. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.వి.ఎస్.రాజు దర్శకత్వంలో రజితా విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకేష్ జాగర్లమూడి టైటిల్ పాత్రలో నటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా చాలా మంచి స్పందన వచ్చింది. అలాగే…