పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన పద్దతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇదివరకైతే.. తను కమిట్ అయిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయడం అలవాటుగా ఉండేది. కానీ ఈ సారి తన పద్ధతి మార్చి విరామం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నారు. సెట్‌లో అడుగుపెడుతూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలను పూర్తి చేయడమే కాదు.. కొత్త చిత్రాల షూటింగ్‌లనూ వెంటనే ప్రారంభిస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి భారీ చిత్రాల రెగ్యులర్ షూటింగ్స్ చేస్తున్నారు. ‘ఆది పురుష్’ సినిమా వర్క్ కూడా కొంత పెండింగ్ లో ఉంది. ఇవన్నీ ఉండగానే…తాజాగా మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్‌లో సైతం అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఓ భారీ హౌస్ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభాస్…