తెలుగు చలనచిత్ర సీమలో ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌తో పరుగులు పెడుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజాగా తన ప్రతిభని నిరూపించుకుంటున్న రవితేజ ఒకరు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది పలు చిత్రాలతో వచ్చాడు. కానీ, అవేవీ రవితేజకు విజయాన్ని మాత్రం అందించలేదు. బిగ్ సక్సెస్ కోసం చూస్తున్న మాస్ మహారాజా నటించిన తాజా చిత్రమే ‘ఈగల్’. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. . హీరో రవితేజ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈ మధ్యకాలంలో ‘క్రాక్’ తర్వాత ఆయన నుండి ఆ…