డిసెంబర్ లో సెట్స్ కి “డ్యూడ్” : ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ !

"Dude" to the sets in December: A heartwarming love story in the background of football!

యువ కథానాయకుడు తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం “డ్యూడ్”. ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. తెలుగు – కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా… స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు “రామాచారి” అనే కన్నడ హిట్ చిత్రంలో నటించారు. తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం “గాడ్” కూడా త్వరలో మొదలు కానుంది!! ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే… కర్ణాటకలోని “కిక్ స్టార్ట్” అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్… “డ్యూడ్” చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది.…