తెలుగు చలన చిత్రసీమలో గొప్ప పేరున్న సీనియర్ దర్శకులు శివ నాగేశ్వరరావు. అలాంటి దర్శకుడి నుంచి కొంత విరామం తర్వాత ఓ చిత్రం వస్తుందంటే ఎవ్వరికైనా ఆసక్తే ఉంటుంది. అది ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి రేకెత్తించడం సహజమే! ఆయన నుంచి గతంలో వచ్చిన మనీ, సిసింద్రీ సినిమాలు ఎంతటి వినోదాన్ని పంచాయో ప్రేక్షకులు ఇంకా మరువలేదు. ఆయా చిత్రాల్లో ఉన్న కంటెంట్ లాంటిది మరి. ఆ చిత్రాల్లో ఆయన చూపిన ప్రతిభను ప్రేక్షకులు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. టాలీవుడ్ లో భారీ విజయాలు సొంతం చేసుకున్న అలాంటి సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా తెరకెక్కించిన కామెడీ అండ్ యాక్షన్ చిత్రం ‘దోచేవారెవరురా’ మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? కొంతకాలా విరామం…