కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ తో ఇంటర్వ్యూ విశేషాలు.. ఎఫ్.ఐ.ఆర్. ఏ తరహా సినిమా? యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమయింది అనేది కథ. మీకు మొదటి సినిమా విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించగలిగారు? విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను.…