అల్లు అర్జున్‌తో ఓఎల్ఎక్స్ యాడ్ చేశా, అల్లు అరవింద్ బ్యానర్‌లో ‘ఆయ్’ చేశా, ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా: అంకిత్ కొయ్య ఇంటర్వ్యూ

Did an OLX ad with Allu Arjun, did 'Ai' under Allu Arvind's banner, did a role saying Allu is a family member in 'Maruti Nagar Subramaniam': Ankit Koya Interview

రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు… అంకిత్… మీరు చాలా సినిమాల్లో నటించారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి! మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు.…