‘బింబిసార’తో గత ఏడాది కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టాడు. ఈ ఏడాది అమిగోస్ అంటూ ఓ ప్రయోగం చేశాడు. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ నాటి కాలానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. డెవిల్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. అలాంటి సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం… కథలోకి వెళితే… డెవిల్ కథ 1945 ప్రాంతంలో జరుగుతుంది. అది కూడా మద్రాసు ప్రావీన్స్ చుట్టూ జరుగుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను పట్టుకునేందుకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అలాంటి టైంలోనే బోస్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడంటూ బ్రిటీష్ ఏజెన్సీలకు లీక్స్ అందుతాయి. బోస్‌ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. అదే టైంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. కూతుర్ని…