తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. గొప్ప నిర్మాత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా చక్కటి గుర్తింపును తెచ్చుకున్న ఆయన అనారోగ్యంతో నేడు (ఏప్రిల్ 2, ఆదివారం) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్‌గా సినిమారంగంలో ప్రవేశించిన ఆయన అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని ‘అరుంధతి’…