సుదర్శన్‌ థియేటర్‌ వద్ద హంగామా..పటాకులు పేల్చడంతో ‘దేవర’ కటౌట్‌ దగ్ధం!

Commotion at Sudarshan Theater..Devara' cut-out burnt due to bursting of firecrackers!

భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి ఒంటి గంటకు ప్రీమియర్‌ షోలు ప్రారంభమైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాధారణంగా స్టార్‌ హీరోల సినిమా విడుదలైనప్పుడల్లా అభిమానులు థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. కానీ వారి మితివిూరిన ఉత్సాహం కొన్నిసార్లు థియేటర్లలో ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌ వద్ద చోటుచేసుకుంది. ‘దేవర’ విడుదల సందర్భంగా థియేటర్‌ ఆవరణలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా, ఎన్టీఆర్‌ కటౌట్‌కు మంటలు అంటుకుని దగ్ధం కావడంతో పాటు కొద్దిసేపటికే మంటలు చుట్టూ భారీగా చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై…